Indian Population
Population - Bharathadesa Janaba
నేటి మోడరన్ భారతదేశం సిరీస్ లోని ఎపిసోడేకి మీకు స్వాగతం. నా జీవితంలో సమస్యలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వరసగా ఎదో క్యూ లైన్ లో నుంచొని వస్తున్నట్లు వున్నా సమయంలో. ఎం చేయాలో అర్ధం కాకా ఒంటరి గా వుండాలనిపించింది. అదేదో ఇంట్లో రూమ్ లో గెడ పెట్టుకొని కాదు. ఈ భూమి మీద నేను ఒక్కడినే ఉన్న అనే ఫీలింగ్ రావడం కోసం ఇంటి నుంచి బండి ఏసుకొని బయల్దేరా. ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు, కానీ ఒంటరితనం కోసం ఎక్కడికైనా వెళ్దాం అని అయితే బయల్దేరా. సుమారు మా ఇంటి దగ్గరలో వున్నా నాకు ఇష్టమైన అన్ని ప్లేసెస్ కి వెళ్ళ. ఎక్కడికి వెళ్లిన చీమలాగా జనం అట్లా చూస్తుంటే కనుచూపుమేరకు అంతా జనమే. అసలు ఎం చేయాలో అర్ధం కావట్లే. ఇప్పుడు దాక చెప్పిందంతా సోది, వదిలేయండి. ఇప్పుడు నుంచి చెప్పేది పట్టించుకోండి, మా తాత వాళ్ళ అన్నదమ్ములు అందరు వ్యవసాయం చేసేవాళ్ళు atleast పశువులనైనా సాగేటోళ్లు , పాడిపంటలతో చక్కగా బతికినారు. మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు, అందరు కాకపోయినా కొందరు, పాడిపంటలు చూసుకున్నారు, వాళ్ళ జీవినోపాదిగా బతికారు. నేను నా అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ఒక్కలు కూడా పాడిపంటలు కాదు కదా. ఒక మొక్క పెంచుకోవాలంటే కష్టం ఆ స్థితికి వచ్చేసాం. మన తర్వాత జనరేషన్ గురుంచి ఆలోచించాలంటే. పాపం అనిపిస్తుంది. ఆ పాపం మనమే చేస్తున్నాము తేలిక కొందరు, తప్పక కొందరు. నాకు తెలుసు ఈ ఎపిసోడ్ వినే ప్రతి ఒక్కరి మూలాలు వ్యవసాయంతో ముడిపడివుందని. కానీ కాలానికిఅనుగుణంగా వృత్తి, ఉద్యోగాలు మారిపోయాయి. మనము మారేము. మనం చేస్తున్నది తప్పు అని చెప్పడం నా ప్రయత్నం కాదు. పెరిగిన జనాభా మనకు తెలీకుండానే పెరిగిందా, మన కులం కంటే వాడి కులంలో జనాభా పెరిగిపోతున్నారు, మనకి పదవులు దూరం అవుతాయి అనే భయంతో మన కులం జనాభా పెంచాలని కొందరు. మన మతం జనాభా పెంచాలని కొందరు. అలానే, భాష, రాష్ట్రం, దేశం. ఇదంతా ఒక ఎత్తు. వేరే దేశం వాళ్ళు, కొంతమంది మన దేశస్థులు కూడా మనకి సెక్స్ ఎడ్యుకేషన్ లేదని విమర్శిస్తుంటారు. ప్రపంచానికే కామసూత్ర అనే గ్రంధాన్ని అందించిన మన దేశానికీ, దేశజనబాకి ఆ మాత్రం అవగాహనా లేదంటారా. ప్రస్తుతానికి మనమే మోస్ట్ పౌపులాటెడ్ కంట్రీ చైనాని దాటాం. ఇలానే జనాభా పెరిగిపోతుంటే నాణ్యమైన ఆహారం, ఆరోగ్యం ఏది ఇవ్వలేం. క్వాలిటీ అని చెప్పి బ్రాండింగ్ చేసుకోడానికి తప్పా ప్రోడక్ట్లో క్వాలిటీ ఉండదు. ఇలానే జనాభా పెరుగుతూ పోతే, one or none అనే స్లోగన్ రాడానికి ఎంతో సమయం పట్టదు. ఈ జనరేషన్ లోనే, కొంతమంది, సమాజం ఏమనుకున్నా పర్లేదు. నాకు పిల్లలొద్దు, అని బతుకుతున్నారు వాళ్ళని ఆలా బతకనివ్వండి కాకులాగా పొడవద్దు. సాధారణంగా ఈ జనరేషన్ లో కొందరి జనానికి వాళ్ళకి పిల్లలు లేకపోతే, ఎదో సమస్య ఉందని నలుగురు అనుకుంటారని పిల్లలు కంటున్నారు. మీరు కంటే కన్నారు, కనకోకుండా, బతికేవాళ్ళని వదిలేద్దాం అని చెప్తూ సెలవు తీసుకుంటున్న. మల్లి వస్తా. Bye
Comments
Post a Comment